ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్!
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్!
హైదరాబాద్: ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
*🔊ఓపెన్ విద్యార్థులందరూ పాస్*
*📜ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
*🍥75 వేల మంది ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం*
*🎙️మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి*
*🏆రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న దూరవిద్యా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యా ర్థులంతా పాస్ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్ మార్కు లను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్ శుక్రవారం జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.*
*📜ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌లో అదనపు సబ్జెక్టు, ప్రాక్టికల్స్‌లోనూ 35 శాతం మార్కులతో పాసైనట్టేనని పేర్కొంది. ప్రస్తుతం కనీస పాస్ మార్కులతో పాసైన విద్యార్థులు తమ మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ స్కూల్ సొసైటీ తదుపరి నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 75 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. అందులో ఎస్సెస్సీ విద్యార్థులు 43 వేల మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 32 వేల మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.*
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు లేకుండానే వారందరికీ ఓక్కో సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతిలో 35 వేల మంది, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా విద్యనభ్యసిస్తున్నారు.
ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు .
TS open school
ఈ సంవత్సరమందు ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు .
పరీక్షలు లేకుండానే విద్యార్థులు అందరూ పాస్ .
అందరు విద్యార్థులకు 35 మార్కులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
Official website:
https://www.telanganaopenschool.org/
0 comments:
Post a Comment