హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 93 ఖాళీలతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2020 మార్చి 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తుకు మార్చి 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్
https://www.tspsc.gov.in/
ఓపెన్ చేసి చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 93మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79
మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04
మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం-
2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 30
విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.
వయస్సు
- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు,
ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు,
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు,
వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.200
పరీక్షా కేంద్రాలు
- హైదరాబాద్,
కరీంనగర్,
ఖమ్మం,
వరంగల్,
నిజామాబాద్.
0 comments:
Post a Comment