ఆధార్ ఉందా.. పదినిమిషాల్లో పాన్‌కార్డ్ ఇలా...
_ఇంటర్నెట్‌డెస్క్: ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు కార్డు పొందాలంటే పేజీల కొద్దీ అప్లికేషన్లు నింపాలి. అదే సమయంలో రోజుల తరబడి ఎదురుచూడాలి. ఈ దెబ్బకు భయపడి చాలా మంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడమే మానేస్తున్నారు. పాన్‌కార్డ్ విషయంలో ఇలాంటి తలనొప్పులు లేకుండా చూడాలని ఆదాయపన్నుశాఖ భావించి వివిధ ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఆధార్ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో ఇస్తే కొన్ని నిమిషాల్లోనే పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) సంఖ్యను జారీ చేస్తోంది. ఇది పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీకు వస్తుంది. సాధారణ పాన్ కార్డుకు ఎంత విలువ ఉంటుందో దీనికి అంతే విలువ ఉంటుంది._
_*👉🏻పాన్ సంఖ్య కోసం ఇలా దరఖాస్తు చేయాలి.👇🏻*_
*- తొలుత ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. అందులో ఎడమవైపు తొలి ఆప్షన్‌గా ఉన్న ‘Instant PAN through Aadhaar’పై క్లిక్ చేయండి*
*- ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఉన్న "Get New PAN" ఆప్షన్‌ను ఎంచుకోండి.*
*- కొత్త పాన్ నంబర్ కోసం మీ ఆధార్ సంఖ్యను అందులో నమోదు చేయండి. అక్కడ చూపించిన కాప్చాకోడ్‌ను కింద ఇచ్చిన బాక్స్‌లో సరిగ్గా నమోదు చేయండి. మీ ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.*
*- ఓటీపీని నమోదు చేయండి*
*- ఆతర్వాత అక్కడ వెబ్‌సైట్ అడిగిన ఆధార్ వివరాలను నమోదు చేయండి.*
*- అక్కడ మీ ఈమెయిల్‌ను పాన్‌కార్డుకు అనుసంధానిస్తూ వాలిడేట్ చేసుకొనే అవకాశం ఉంది.*
*- మీ ఆధార్ వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సరిచూసుకొంటుంది. ఆ తర్వాత మీకు ‘ఈ పాన్’ కేటాయిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌కు పదినిమిషాల సమయం కూడా పట్టదు.*
*- దీంతోపాటు మీ పాన్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడు చేసుకొనే అవకాశం కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంది. మీ ఆధార్ వివరాలను నమోదు చేశాక Check Status/ Download PAN ఆప్షన్‌ను ఎంచుకొంటే మీ ఈమెయిల్‌కు పాన్‌కార్డు పీడీఎఫ్ వస్తుంది.*
*👉🏻ఇవి అవసరం....👇🏻*
*- మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు జతచేసి ఉండాలి.*
*- మీరు అంతకు ముందు పాన్ కార్డు పొంది ఉండకూడదు.*
*- ఆధార్ కార్డులో ఉన్న విధంగానే DD-MM-YYYY ఫార్మాట్‌లోనే మీ పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. మైనర్లకు ఈ పాన్‌కార్డు జారీ చేయరు.*
0 comments:
Post a Comment