LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

UGC NET -2019 దరఖాస్తుల సవరణకు అవకాశం

Posted by PAATASHAALANEWS on Friday, 18 October 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

UGC NET -2019 దరఖాస్తుల సవరణకు అవకాశం...

*- అక్టోబరు 25 వరకు వివరాల మార్పునకు అవకాశం*

*- నవంబరు 9 నుంచి హాల్‌టికెట్లు..*

*- డిసెంబరులో పరీక్ష నిర్వహణ*

_దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు) - 2019 పరీక్షకు దరఖాస్తు గడువు అక్టోబరు 15తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించుకోవడానికి నేషనల్ టెస్టింగ్ అవకాశం కల్పించింది._

_అభ్యర్థులు అక్టోబరు 18 నుంచి 25 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ వివరాలను సవరించుకోవచ్చు._

*తప్పుల  సవరణ కోసం*
👇👇👇👇👇

https://testservices.nic.in/examsys/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgO5uWoSIwyyaXi+a60ulNUkBSnyHjY/9Hykz6wySPz/Y

_ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్ పరీక్షనిర్వహించనున్నారు. డిసెంబరు 31న ఫలితాలను విడుదల చేస్తారు._

*👉🏻 పరీక్ష విధానం..*

_ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది._

_పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి._

_ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి._

_ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు._

_మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు._

*👉🏻ముఖ్యమైన తేదీలు:-*

✦ *ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019*

✦ *ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.10.2019*

✦ *ఫీజు చెల్లించడానికి చివరితేది: 16.10.2019*

✦ *దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 25.10.2019 వరకు.*

✦ *అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019*

✦ *నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 - 6 వరకు.*

*ఫలితాల వెల్లడి: 31.12.2019*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 18, 2019

0 comments:

Post a Comment