*దోస్త్’ నోటిఫికేషన్ వచ్చేసింది*!
*హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గతంలో ఈ నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన దోస్త్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు సంబంధించిన ముఖ్య తేదీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు*.
*నోటిఫికేషన్‌లో ముఖ్య తేదీలు*..
*ఈ నెల 23 నుంచి జూన్ 3 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు*
*ఈ నెల 25 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం*
*జూన్ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు*
**జూన్ 10 నుంచి జులై 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు*
*జూన్ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*
*జూన్ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు*.
*జూన్ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు*
*జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం*
0 comments:
Post a Comment