LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌

Posted by PAATASHAALANEWS on Monday, 18 February 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ పరిధిలో 497 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు.
ధరఖాస్తు రుసుం రెట్టింపు:

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సమీపంలోని మీ–సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఈసారి దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతేడాది దరఖాస్తు రూ.50 ఉండగా.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.100కు పెంచారు. ఈనెల 18వ తేదీనుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్‌ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్‌ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది. దరఖాస్తుకు సంబంధించి సందేహాల నివృత్తి, గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–425–45678 నంబర్‌లో.. లేదా  http://tswreis.in,

 http://tresidential. cgg.gov.in
, http://tgtwgurukulam. telangana.gov.in,
 http://mjptb cwreis.cgg.gov.in,
 http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడాలని సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
.

_*దరఖాస్తు గడువు:*_ ఆన్‌లైన్ ద్వారా తేది 18-02-2019 నుండి 10-03-2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.

_*ప్రవేశ పరీక్ష తేది:*_ 07-04-2019 నాడు ఉదయం 11:00 గం.ల నుండి మధ్యాహ్నం 1:00 గం. వరకు
_*కావలసినవి:*_
1. పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
2. ఆధార్ కార్డ్
3. అభ్యర్థి సంతకం
_*వెబ్‌సైట్:*_ http:/tgcet.cgg.gov.in
_*గురుకులాల ప్రత్యేకతలు:*_
1. సమర్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయులచే బోధన.
2. 24 గంటలు ఉపాధ్యాయుల పర్యవేక్షణ.
3. IIT, EAMCET, NEET లాంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించటం.
4. అధిక సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో MBBS, BDS లలో ప్రవేశాలు పొందేలా ఉత్తమ శిక్షణ.
5. సెంట్రల్ యూనివర్సిటీలు, TISS వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా పోటీ పరీక్షలకు వేసవి క్యాంపుల ద్వారా శిక్షణ.
6. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి హౌస్ మాస్టర్/హౌస్ పేరెంట్ వ్యవస్థ.
7. పాఠ్యాంశాలతో పాటు సహా పాఠ్యాంశాలు, క్రీడలు మొదలగు వాటిపై ప్రత్యేక శ్రద్ధ.
8. శారీరక విద్యా (ఫిజికల్ ఎడ్యుకేషన్), యోగాలో శిక్షణ.
9. అన్ని ప్రభుత్వ పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం.
_*విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు:*_
1. సన్న బియ్యంతో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన ఆహారం అందించుట.
2. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచిత సరఫరా.
3. విద్యార్థులకు స్టేషనరీ పెన్నులు, పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు వగైరా ఉచిత సరఫరా.
4. మూడు జతల స్కూల్ యూనిఫాం సరఫరా.
5. పి.టి డ్రెస్, ట్రాక్ షూట్, స్పోర్ట్స్ షూ మరియు ఇతర సౌకర్యాల కల్పన.
6. ప్లేట్, గ్లాస్, బెడ్సిట్స్, బ్లాంకెట్ల ఉచిత సరఫరా.
7. విద్యార్థిని విద్యార్థులకు సబ్బుల కొనుగోలుకు పైసల పంపిణీ మొదలైనవి.
8. నెలకు 4 పర్యాయాలు, చికెన్ 2 పర్యాయాలు మటన్ తో భోజనం.
*మీ*,
- లక్ష్య శ్రీ సేవ ఫౌండేషన్
మైనార్టీల్లో ప్రత్యేకం
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యాశాఖ సొసైటీల్లోని గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి సీట్లభర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. మైనార్టీ గురుకుల పాఠశాలలకోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదేవిధంగా అన్ని గురుకుల సొసైటీల్లో 6 నుంచి 10వ తరగతి వరకున్న ఖాళీల భర్తీకి కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తారు. వీటి భర్తీ ఈ విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత ఏర్పడే ఖాళీలపై ఆధారపడి ఉంటుంది.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: February 18, 2019

0 comments:

Post a Comment