*🌈కేంద్రీయ విద్యాలయంలో 562 పోస్టులు.*
📝📝కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్(కెవిఎస్) 562 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిలో 16 పోస్టులను వికలాంగులకు ప్రత్యేకించారు. ఈ పోస్టులన్నీ నార్త్ ఈస్టర్న్ జోన్‌లో ఉన్నాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
📝📝ఈ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) 182(5 పోస్టులు వేరుగా వికలాంగులకు), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ) 144(4), ప్రైమరీ టీచర్స్(పిఆర్‌టి) 220(7) ఉన్నాయి.
*🏝పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ):*
📝📝హిందీ (25) (1), ఇంగ్లీష్ (20) (1), హిస్టరీ (18), ఎకనామిక్స్ (28) (1), జాగ్రఫీ (17) (1), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (20), మేథ్స్ (24) (1) ఉన్నాయి. వయసు అక్టోబర్ 31 నాటికి 40 సంవత్సరాలకు లోపు ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేల్ రూ.9300 - రూ.34800, గ్రేడ్ పే రూ.4800(ప్రీ రివైజ్డ్) ఇస్తారు.
*🏝ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ):*
📝📝 హిందీ (28) (1), ఇంగ్లీష్ (26) (1), సంస్కృతం (17), సోషల్ స్టడీస్ (22) (1), మేథ్స్ (24) (1), సైన్స్ (27) ఉన్నాయి. వయసు అక్టోబర్ 31 నాటికి 35 సంవత్సరాలకు లోపు ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేల్ రూ.9300 - రూ.34800, గ్రేడ్ పే రూ.4600(ప్రీ రివైజ్డ్) ఇస్తారు.
*🏝ప్రైమరీ టీచర్స్(పీఆర్‌టీ):*
📝📝 (220)(7) ఉన్నాయి. వయసు అక్టోబర్ 31 నాటికి 30 సంవత్సరాలకు లోపు ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేల్ రూ.9300 - రూ.34800, గ్రేడ్ పే రూ.4200(ప్రీ రివైజ్డ్) ఇస్తారు.
📝📝ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎప్పటికీ నార్త్ ఈస్టర్న్ జోన్‌లోనే పని చేయాల్సి ఉంటుంది. అయితే వైస్ ప్రిన్సిపాల్/ ప్రిన్సిపాల్ పోస్టులకు ప్రమోషన్ పొందిన తరవాత దేశంలో ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశం లభిస్తుంది. అక్టోబర్ 17 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చాలా జాగ్రత్తగా నింపాలి.
📝📝ఇటీవల తీసుకున్న ఫొటో అలాగే సంతకాన్ని స్కాన్ చేసి అవసరమైన చోట అప్‌లోడ్ చేయాలి. తదుపరి ప్రింటవుట్ తీసుకుని దానిపై ఫొటో అతికించుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వెరిఫికేషన్ సమయంలో దాంతోపాటు, అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్ట్ చేసిన సర్టిఫికెట్ కాపీలను కూడా అప్పుడు వెంట తెచ్చుకోవాలి.
📝📝రాత పరీక్ష, ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
*🍂వెబ్‌సైట్: www.kvsangathan.nic.in🍂*
0 comments:
Post a Comment