LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

వరల్డ్‌ జియోగ్రఫీ బిట్‌బ్యాంక్‌ – 1

Posted by PAATASHAALANEWS on Saturday, 3 June 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

*వరల్డ్‌ జియోగ్రఫీ బిట్‌బ్యాంక్‌1*

👉భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
– టాలమి (గ్రీస్‌)

👉సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
– కోపర్నికస్‌ (పోలండ్‌)

👉విశ్వంలో పెద్ద గెలాక్సీ?
– హైడ్రా

👉పాలపుంతను స్వర్గానికి దారులుగా భావించినవారు?
– గ్రీకులు

👉పాలపుంతను ఖగోళ నదులు అన్నవారు?
– చైనీయులు

👉పాలపుంతను ‘ఆకాశ గంగ’ అని పేర్కొన్నవారు?
– భారతీయులు

👉ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం?
– కాంతి పరిక్షేపణం

👉నక్షత్రాలు ఏర్పడటానికి కావాల్సిన ఉష్ణోగ్రత?
– 10 మిలియన్‌ డిగ్రీలు

👉బ్లాక్‌ హోల్స్‌పై పరిశోధనకు నోబెల్‌ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త?
– సుబ్రమణ్యం చంద్రశేఖర్‌ (1983)

👉ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం?
– పార్సెక్‌

👉కాంతి వేగం సెకన్‌కు?
– 2,99,793 కి.మీ

👉కాంతి సంవత్సరం = 9.4 × 1012 KM / 9.4× 1015 మీ.
సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం?
– ఆల్ఫాసెంటారి

👉భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాల్లో ఒకటి సూర్యుడు కాగా రెండోది?
– ప్రాక్సిమా సెంటారీ

👉ఉపగ్రహాలు లేని గ్రహాలు?
– బుధుడు, శుక్రుడు

👉భూమికి కవల గ్రహం?
– శుక్రుడు

👉ఉదయ తార, సంధ్యాతార అని ఏ గ్రహాన్నంటారు?
– శుక్రుడు

👉గ్లోబును ఎవరు రూపొందించారు?
– మెర్కేటర్‌ (నెదర్లాండ్స్‌)

👉అత్యధిక సాంద్రత గల గ్రహం?
– భూమి

👉భూగోళం సగటు ఉష్ణోగ్రతలు?
– 13ని–15ని సెంటీగ్రేడ్‌

👉ఎర్రని గ్రహం (అరుణ గ్రహం)?
– కుజుడు

👉భూమికి సన్నిహిత పోలికలు గల గ్రహం ?
– కుజుడు
👉అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం
– బృహస్పతి (65

👉సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం?
– గనిమెడా

👉గోల్డెన్‌ ప్లానెట్, మూడు వలయాలుగా గల గ్రహం?
– శని

👉ఉపగ్రహాల్లో రెండో పెద్దది, వాతావరణం కలిగింది?
– టైటాన్‌

👉అత్యల్ప సాంద్రత గల గ్రహం?
– శని

👉తూర్పు నుంచి పడమరకు భ్రమణం చేసే గ్రహాలు?
– శుక్రుడు, యురేనస్‌

👉ప్లూటోని గ్రహాల నుంచి తొలగించిన సమావేశం?
– ప్రేగ్‌ సమావేశం (2006)

👉చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
– సెలినాలజీ

👉చంద్రుడి కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
– 1.3 సెకన్లు

👉హేలీ తోకచుక్క ఎన్నేళ్లకోసారి కనిపిస్తుంది?
– 76 ఏళ్లు

👉అక్షాంశ, రేఖాంశాలను మొదట గుర్తించిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ?
– హిప్పార్కస్‌

👉భూగోళంపై మొత్తం అక్షాంశాలు?
– 181

👉భూగోళంపై మొత్తం రేఖాంశాలు?
– 360

👉0ని గ్రీనిచ్‌ రేఖాంశం ఏ దేశాల మీదుగా వెళ్తుంది?
– బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా, మాలి, ఘనా

👉ప్రపంచంలో కాల మండలాలు ఎక్కువగా ఉన్న దేశం?
– రష్యా‌ (12)

👉భూ భ్రమణ వేగం?
– గంటకు 1610 కి.మీ

👉భూ పరిభ్రమణ వేగం?
– గంటకు 1,07,200 కి.మీ

👉పగలు, రాత్రులు సమానంగా ఉండే రోజులు?
– మార్చి 21, సెప్టెంబర్‌ 23

👉పగలు సుదీర్ఘంగా ఉండే రోజు?
– జూన్‌ 21

👉రాత్రి ఎక్కువగా ఉండే రోజు ?
– డిసెంబర్‌ 22

👉ఖండచలన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించినవారు?
– అబ్రహం ఆర్టీలియస్‌

👉ప్రపంచంలో పొడవైన పర్వతాలు?
– ఆండీస్‌ (దక్షిణ అమెరికా)

👉ప్రపంచంలో పక్షి పాద డెల్టా ?
– మిసిసిపి డెల్టా

👉ప్రపంచంలో పెద్ద డెల్టా/డిజిటల్‌ డెల్టా?
– గంగానది డెల్టా (సుందర్బన్స్‌)

👉ఎడారుల్లో ఏర్పడే అర్ధ చంద్రాకారపు ఇసుక దిబ్బలు?
– బార్కాన్లు

👉యువాలాలు దేని వల్ల ఏర్పడతాయి?
– అంతర్భూజలం

👉ప్రపంచంలో పెద్ద జలపాతం?
– నయాగరా (ఉత్తర అమెరికా)

👉ప్రపంచంలో ఎల్తైన జలపాతం ?
– ఏంజిల్‌ (వెనెజువెలా – దక్షిణ అమెరికా)

👉ధనస్సు ఆకారంలో ఉండే డెల్టా?
– నైలునది డెల్టా

👉ఏరేట్స్‌ అనే స్వరూపాలు దేని వల్ల ఏర్పడతాయి?
– హిమానీ నదాలు

👉గ్రాఫైట్‌ రూపాంతరం చెందితే ఏర్పడేది?
– వజ్రం

👉భూకంప తరంగాలను గుర్తించి నమోదు చేసేది?
– సిస్మోగ్రాఫ్‌ (భూకంప తరంగ లేఖిని)

👉భూకంప తీవ్రతను అంచనా వేసేది?
– రిక్టర్‌ స్కేలు

👉సగటున భూమి ఒక నిమిషానికి ఎన్ని కేలరీల శక్తిని గ్రహిస్తుంది?
– 2 కేలరీలు

👉17ని అక్షాంశం వద్ద వేసవిలో పగటి ప్రమాణం?
–13 గంటలు

👉66ని అక్షాంశం వద్ద వేసవిలో పగటికాలం?
– 24 గంటలు

👉ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ?
– జెవోస్టాక్‌ (అంటార్కిటికా)

👉ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
– అజీజియా

👉ఓజోన్‌ పొర ఏ ఆవరణంలో ఉంటుంది?
– స్ట్రాటో ఆవరణం

👉ఉల్కలు ఏ ఆవరణంలోకి ప్రవేశించగానే నాశనమవుతాయి?
– మీసో ఆవరణం

👉వాతావరణంలో మార్పులన్నీ జరిగే ఆవరణం?
– ట్రోపో ఆవరణం

👉గాలి వేగాన్ని కొలిచే పరికరం?
– అనిమో మీటర్‌

👉భూగోళంలో మానవులకు ఉపయోగపడే నీటి శాతం?
– 1 శాతం

👉ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సముద్రం?
– మృత సముద్రం

👉ప్రపంచంలో అత్యల్ప లవణీయత గల సముద్రం?
– బాల్టిక్‌ సముద్రం

👉కాంగో పరీవాహక ప్రాంతంలో ఆదిమ వాసులు?
– పిగ్మీలు

👉అమెజాన్‌ పరీవాహక ప్రాంతంలో ఆదిమ వాసులు?
– రెడ్‌ ఇండియన్లు

👉మలేసియాలోని ఆదిమ వాసులు?
– సెమాంగులు/సకామీలు

👉ప్రపంచంలో పొడవైన నది?
– నైలునది

👉ప్రపంచంలో పరిమాణంలో పెద్ద నది?
– అమెజాన్‌

👉ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం?
– అబదాన్‌ (ఇరాన్‌)

👉ప్రపంచంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం?
– హవాయి దీవులు – వయలిన్ శిఖరం

👉ప్రపంచంలో పెద్ద జల సంధి?
– డేవిస్‌ జలసంధి

👉ప్రపంచంలో పొడవైన జలసంధి?
– టార్టార్‌ జలసంధి

👉ప్రపంచంలో పెద్ద సింధుశాఖ?
– మెక్సికో సింధుశాఖ

👉ప్రపంచంలో లోతైన సరస్సు?
– బైకాల్‌ (రష్యా)

👉ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు?
– సుపీరియర్‌ (ఉత్తర అమెరికా)

👉ప్రపంచంలోకెల్లా పెద్ద దీవుల సముదాయం?
– ఇండోనేసియా

👉ప్రపంచంలోకెల్లా పెద్ద భూ పరివేష్టిత దేశాలు?
– కజకిస్థాన్, మంగోలియా

👉మానవజాతి పుట్టినిల్లు?
– ఆఫ్రికా ఖండం

👉హాలీవుడ్‌గా ప్రసిద్ధి చెందింది?
– లాస్‌ఏంజిల్స్‌

👉ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం?
– కెనడా

👉ప్రపంచంలో ఎల్తైన సరస్సు?
– టిటికాకా (పెరూ – బొలీవియా)

👉యూరప్‌ ఖండంలో ఎల్తైన శిఖరం?
– ఎల్‌బ్రజ్‌ (5642 మీ.)

👉యూరప్‌లో పొడవైన నది?
– ఓల్గా

👉శాశ్వత నగరం/సప్త పర్వతాల నగరం?
– రోమ్‌

👉వేయి సరస్సుల దేశం?
– ఫిన్‌లాండ్‌

👉అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం?
– నార్వే

👉ఆస్ట్రేలియాలో తుపాన్లను ఏమంటారు?
– విల్లీ విల్లీ

👉ఆస్ట్రేలియాను కనుగొన్నది?
– కెప్టెన్‌ జేమ్స్‌ కుక్‌

👉ఎడారులు లేని ఖండం?
– యూరప్‌

👉విక్టోరియా ఎడారి ఏ దేశంలో ఉంది?
– ఆస్ట్రేలియా*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 03, 2017

0 comments:

Post a Comment