LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

CURRENT AFFAIRS@5

Posted by PAATASHAALANEWS on Monday, 15 May 2017


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

CURRENT AFFAIRS

*రాష్ట్రీయం*
1) మన రాష్ట్రానికి చెందిన ఎవరి జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది?
*జ. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి దరిపల్లి రామయ్య .*
( నోట్: మొక్కలు పెంచాలని చెప్పే రామయ్యకు ఈ మధ్యే పద్మశ్రీ పురస్కారం లభించింది)

*జాతీయం*
2) కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఏ హైకోర్టు న్యాయమూర్తికి 6 నెలల జైలు శిక్ష విధించింది ?
*జ. కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీ.ఎస్.కర్ణన్.*

3) రైల్వేల్లో సంస్కరణల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ పేరేంటి?
*జ) రైల్వే డెవలప్ మెంట్ అథారిటీ.*
(నోట్: రైల్వే ప్రమాణాలు, టికెట్ ధరలు, ఇతర ఛార్జీలన్నింటినీ ఈ సంస్థ ఖరారు చేస్తుంది)

4) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ట్యాంపరింగ్ చేయొచ్చని చెప్తున్న పార్టీ ఏది?
*జ. ఆమ్ ఆద్మీ పార్టీ.*
(నోట్: EVMలను ఎలా దుర్వినియోగం చేయొచ్చో ఆప్ ఎమ్మెల్యే సౌరవ్ భరద్వాజ్ ఢిల్లీ అసెంబ్లీలో డమ్మీ ఈవీఎం ద్వారా ప్రదర్శించారు)

5) ఏ క్రికెటర్ కి బ్రిటన్ ప్రభుత్వం ఫెల్లో షిప్ అవార్డు ప్రకటించింది ?
*జ: సచిన్ టెండూల్కర్*

6) Outstanding Achievement in music కింద బ్రిటన్ ప్రభుత్వం ఫెల్లో షిప్ అవార్డు ఏ భారతీయుడికి ప్రకటించింది ?
*జ: ప్లేబాక్ సింగర్ అద్నాన్ సమీ*

7) క్లాసికల్ తమిళ్ విభాగంలో 2015-16 సంవత్సరానికి తొల్కప్పియర్ అవార్డును ఎవరికి ప్రకటించారు ?
*జ: ఆర్ కలైక్కోవన్*

8) దల్మా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
*జ: జార్ఖండ్ ( జంషెడ్ పూర్ కి 10 కిమీల దూరంలో)*

9) 2018 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ ఎంత ఉంటుందని IMF విడుదల చేసిన రీజినల్ ఎకనామిక్ ఔట్ లుక్ లో పేర్కొన్నారు ?
*జ: 7.2శాతం*

10) బిష్ణు పర్వ (సెండ్రా) అనే గిరిజన ఉత్సవం ఏ రాష్ట్రంలో జరిగింది ?
*జ: జార్ఖండ్*

11) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రధాన కార్యాలయంలో ఏ రాష్ట్రంలో ఉంది ?
*జ: న్యూఢిల్లీ*

12) ఉస్తాద్ రాయీస్ ఖాన్ ఏ దేశానికి చెందిన సితార వాయిద్యకారుడు ?
*జ: పాకిస్థాన్*

13) నెదర్లాండ్స్ లో కొత్తగా భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి ఎవరు ?
*జ: వేణు రాజమోనీ*

14) బోట్ అంబులెన్స్ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రమేది?
*జ. ఒడిషా*

15)మహిళ వన్డే క్రికెట్ లో ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టిన ప్లేయర్ ఎవరు?
*జ) భారత పేసర్ జులన్ గోస్వామి. ( ఈమె ఇప్పటి వరకు 153 మ్యాచ్ ల్లో 181 వికెట్లు తీసింది.)*

16) రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రచురించే పక్ష పత్రిక ఏది?
*జ) న్యూస్ లెటర్*

17) ఇంద్ర ధనుష్ పథకం దేనికి సంబంధించినది?
*జ) చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన టీకాల పథకం*

18) గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్స్ ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?
*జ) నిసాబా ( గౌరవ ఛైర్మన్ హోదాలో ఉన్న ఆది గోద్రేజ్ రెండో కూతురు)*

*అంతర్జాతీయం*

19) భారతీయ నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కి పాకిస్థాన్ కోర్టు విధించిన మరణశిక్షపై ఏ న్యాయస్థానం స్టే విధించింది ?
*జ: అంతర్జాతీయ న్యాయస్థానం* 

20) రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని మే 2017లో భారత్ నిర్ణయించింది ?
*జ: జపాన్*

21) ఐక్యరాజ్య సమితి ఆవాసం ( UN Habitat-2017) 26వ గవర్నింగ్ కౌన్సెల్ సమావేశం ఏ దేశంలో జరుగుతోంది ?
*జ: కెన్యా*

22) భారత్ లో జన్మించి, ఇటీవల కరాచీలో కన్నుమూసిన ప్రముఖ సితార వాయిద్యకారుడు ఎవరు ?
*జ: రాయిస్ ఖాన్*

23) ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ గా ఫుట్ బాల్ రైటర్స్ అసోసియేషన్ ఎవరిని ఎంపిక చేసింది?
*జ. ఫ్రాన్స్ ఫుట్ బాలర్ గోలో క్యాంట్. ( ఈ అవార్డును 1948 నుంచి అందజేస్తున్నారు)*

24) 2017 సంవత్సరానికి గాను సండే టైమ్స్ ప్రకటించిన ధనవంతుల జాబితాలో మొదటగా నిలిచినది ఎవరు ?
*జ: శ్రీ అండ్ గోపీ హిందూజా*

25) స్మార్ట్ హౌస్ ఐడీలను ఏ రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు ?
*జ: హర్యానా*

26) వాల్డ్ వార్ – 2 నాటి పేలని బాంబులను ఏ దేశంలో కనుగొన్నారు ?
*జ: జర్మనీ*

27) మూడు రోజుల పర్యటన కోసం INS ముంబై, INS ఆదిత్య ఏ దేశానికి వెళ్ళాయి ?
*జ: ఈజిప్ట్*

28) అంతర్జాతీయ వ్యాపార కాపలాదారుడు అని ఏ సంస్థను పిలుస్తారు ?
*జ. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (ప్రపంచ వాణిజ్య సంస్థ)*

29) దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
*జ: డెమోక్రటిక్ అభ్యర్థి మూన్ జే-ఇన్*

30) న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన మూవీ ఏది ?
*జ: ముక్తి భవన్*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 15, 2017

0 comments:

Post a Comment