గ్రూప్ పరీక్షలు రాసే సోదర సోదరీమణులకు ఉపయోగపడే ఆర్టికల్....
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
@ కల్యాణలక్ష్మి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? - 2014, అక్టోబర్ 2
@ కల్యాణలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం? - రూ. 51,000
@ కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ యువతులకు కూడా వివాహ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు?
- 2016 ఏప్రిల్ 1
@ కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే సంబంధిత యువతుల తల్లిదండ్రుల వార్షికాదాయం ఎంతకు మించరాదు?
- రూ.2 లక్షలు
@ షాదీ ముబారక్ పథకం ఉద్దేశం?
- పేద ముస్లిం యువతులకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించడం
@ ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - మహబూబ్‌నగర్ జిల్లా
షాద్‌నగర్ నియోజకవర్గంలోని
కొత్తూరు గ్రామంలో
@ ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2014, నవంబర్ 8
1 ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? - తెలంగాణ ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్‌రావు
@ ‘ఆసరా’ పింఛన్ పథకం కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది? - రూ.4,700 కోట్లు
@ తెలంగాణలో ‘ఆసరా’ పింఛన్ పథకం కింద ఎంత మంది లబ్ధి పొందుతున్నారు?
- 37,65,304 మంది
@ వృద్ధులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - రక్షణ
@ వితంతువులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- జీవనాధారం
@ చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- చేయూత
@ కల్లుగీత కార్మికులకు అమలుచేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- ఆలంబన
@ ఎయిడ్‌స బాధితులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? - భరోసా
@ వికలాంగులకు అమలు చేస్తున్న ‘ఆసరా’ పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు?
- భద్రత
@ ‘ఆసరా’ పింఛన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్‌స బాధితులు ప్రతి నెలా ఎంత మొత్తం పొందుతున్నారు?
- రూ.1000
@ వికలాంగులకు ప్రతి నెలా ఇచ్చే ‘ఆసరా’ పింఛన్ ఎంత? - రూ.1500
@ ప్రస్తుతం ‘ఆరోగ్య లక్ష్మి’గా పేర్కొంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు?
- ఇందిరమ్మ అమృత హస్తం
@ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జనవరి 1
@ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ఏ కేంద్రాల ద్వారా అమలుచేస్తున్నారు? - అంగన్‌వాడీ కేంద్రాలు
@ బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు సంపూర్ణ పోషకాహారం అందించేందుకు ఉద్దేశిం చిన పథకం? - ఆరోగ్యలక్ష్మి
@ గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, ఆగస్టు 17
@ గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - గంగదేవిపల్లి (వరంగల్ జిల్లా)
@ మన ఊరు-మన ప్రణాళికకు కొనసాగింపుగా రూపకల్పన చేసిన పథకం? - గ్రామజ్యోతి
@గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు?
- 7 కమిటీలు. అవి.. పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ; ఆరోగ్యం-పోషకాహారం కమిటీ; విద్యా కమిటీ; సామాజిక, పేదరిక నిర్మూలనా కమిటీ; మౌలిక సదుపాయాల కల్పన కమిటీ; సహజ వనరుల నిర్వహణ కమిటీ; వ్యవసాయ కమిటీ
@ మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆర్థిక సాయంతో హరే రామ హరే కృష్ట ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు? - సద్దిమూట, భోజనామృతం
@సద్దిమూట పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2014, అక్టోబర్ 13
@ సద్దిమూట పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? - సిద్దిపేట మార్కెట్ యార్‌డ
@సద్దిమూట పథకం ఉద్దేశం?
- మార్కెట్ యార్డులో రైతులు, హమాలీలకు రూ.5కే భోజనం అందించడం
@ భోజనామృతం కార్యక్రమ ఉద్దేశం?
- మాతా శిశు సంరక్షణ,
ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు
ఉచితంగా భోజనం అందించడం
@ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ).. పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి, అడ్డా కూలీలకు ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిం చింది? - 2014, జూలై 17
@ ఎవరి సాయంతో జీహెచ్‌ఎంసీ ఈ భోజన పథకాన్ని ప్రారంభించింది?
- అక్షయపాత్ర ఫౌండే షన్
@ ఆహార భద్రత పథకం లబ్ధిదారులను ఏ సర్వే ఆధారంగా గుర్తించారు?
- సమగ్ర కుటుంబ సర్వే
@ ఆహార భద్రత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జనవరి 1
@ ఆహార భద్రత పథకం కింద కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు? - రూ.1కి కిలో చొప్పున 6 కిలోలు
@నిరుపేద విద్యార్థులకు సన్న బియ్యం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, జనవరి 1
@‘మన ఊరు-మన చెరువు’ నినాదంతో రూపకల్పన చేసినకార్యక్రమం?
- మిషన్ కాకతీయ
@ మిషన్ కాకతీయ పైలాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎక్కడ ఆవిష్కరించారు? - నిజామాబాద్ జిల్లా
సదాశివ నగర్ మండలం పాతచెరువు
@ మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
- రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ
మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, మార్చి 12
@మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? - షీ టీమ్స్
@ షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- 2014, అక్టోబర్ 24
@ హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 33%
@ మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూలై
@ మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - చిలుకూరు
బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)
@ తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 40 కోట్ల మొక్కలు
@ రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2016, జూలై 8
@ రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)
@ రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - 46 కోట్ల మొక్కలు
@ వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూన్ 8
@ వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?
- ప్రతి ఇంటికి నల్లాల ద్వారా
మంచి నీటిని అందించడం
@ వాటర్‌గ్రిడ్ పథకం పేరు?
- మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)
@ ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
- పల్లె సమగ్ర సేవా కేంద్రం
@ పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- 2015, అక్టోబర్ 2
@ పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?- బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా
@ ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు? - డిజిటల్ తెలంగాణ
@ డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - 2015, జూలై 1
0 comments:
Post a Comment