LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

General Knowledge Bits in Telugu

Posted by PAATASHAALANEWS on Thursday, 6 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Telangana General Knowledge Bits in Telugu
1.తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో కల్పించిన హామీల అమలుకు 1958 ఫిబ్రవరిలో ఏర్పడిన కమిటీ
Ans: తెలంగాణ ప్రాంతీయ కమిటి
2. తెలంగాణ ప్రాంతీయ కమిటి తొలి అధ్యక్షులు
Ans: అచ్యుత్ రెడ్డి
3.ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికీ హైదరాబాద్ రాష్ట్రం ఎన్ని కోట్లు మిగులుతో ఉంది?
Ans: రూ. 4,49 కోట్లు    
4.1956 – 68 మధ్య కలంలో అధికార గుణాంకాల ప్రకారం తెలంగాణకు చెందిన ఎన్ని నిధులను ఆంధ్రప్రాంతంలో ఖర్చు చేయడం జరిగింది?
Ans: రూ. 110 కోట్లు
5.తెలంగాణ ప్రాంతీయ కమిటీ అద్యక్షుడు అచ్యతన్ రెడ్డి లేఖకు స్పందిస్తూ 1961లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య తెలంగాణ మిగులు నిధులతో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి హామి ఇచ్చారు
Ans: పోచంపాడు ప్రాజెక్టు, కొత్తగూడెంలో ఎరువుల కర్మాగారం
6. 1969 జనవరిలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం విద్యార్ధుల ఉద్యమం ఎక్కడ మొదలెంది?
Ans: ఖమ్మంలో (ఇదే అనంతరం ప్రతేక తెలంగాణ ఉద్యమంగా రూపుదాల్చింది)
7. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గ్రాంటు మంజూరు చేయడంలో జాప్యం చేసి, దాన్ని ప్రభుత్వంలో ఒక శాఖగా మార్చాలని చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికోడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రాతిపత్తి కోసం పోరాటం జరపాలని నిర్ణయించిన విద్యార్ధి నేత
Ans: ఉస్మానియా విద్యార్ధి సంగు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్
8. 1956 జనవరిలో మాదన్మోహన్ కన్వినర్ గా ఏర్పడి సంస్థ
Ans: తెలంగాణా పీపుల్స్ కన్వెన్షన్
9. విద్యార్ధులు చేపటిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఎన్. జి. ఓ. ల సంగం
Ans: కె. ఆర్. ఆమోస్
10. 1969లో ప్రత్యక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసినది
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
11. 1969లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ను ఏ సంస్థగా మార్చడం జరిగింది?
Ans: తెలంగాణ ప్రజా సమితి
12. 1969 మార్చిలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష కార్యదర్శులు
Ans: మదన్ మోహన్, వెంకట్రామారెడ్డి
13. 1969 జూన్ 1న కొండా లక్ష్శణ్ బాపూజీ అధ్యక్షతన ఏర్పాటైన పార్టీ
Ans: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్
14. స్థానిక ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాoతియులనే భర్తీ చేయాలనే, స్థానికేతర ఉద్యోగులందరినీ వారి సొంత జిల్లాలకు తాత్కాలిక ఖాళీలలోకి బదిలి చేయాలని 1969లో ప్రభుత్వం జారీ చేసిన జీవో
Ans: జీ. వో. నం. 36
15. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంఫై ప్రభుత్వ అణచివేత చర్యల కారణంగా ఎంత మంది మరంచారు?
Ans: దాదాపు 369 మంది
16. తెలంగాణ మృతవీరుల స్మారకార్ధం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వద్ద నిర్మించిన స్మారక స్థూపం పేరు
Ans: గన్ పార్క్
17. గన్ పార్క్ శిల్పాని  చెక్కినది
Ans: ఎ. యాదగిరిరావు
18. 1969లో తెలంగాణ ఉద్యమం సందర్బంగా దోపిడి చేసే  ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుమాలే, ప్రాంతం వాడే దోపిడి చేస్తే, ప్రాణంతోటే పాతరపెట్టాలే’ అన్నది
Ans: ప్రజాకవి కాళోజి నారాయణరావు
19. తెలంగాణ ఉద్యమంలో ఘలమీ కి జిందగీసే మౌత్ అచ్చి (బానిస బతుకు కంటే చావడం మేలు) అని ఉపన్యసించినది ఎవరు?
Ans: కె. వి. రంగారెడ్డి
20. 1969 ఉద్యమ నేపధ్యంలో తెలంగాణ ప్రజలను సంత్రుప్తిపరచడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
21. 1971లో జారిగిన సార్వత్రిక ఎనికల్లో తెలంగాణలోని 14 ఎంపి స్థానాలకు గాను 10 స్థానాలను గెలుచుకున్న పార్టీ
Ans: మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాసమితి (టిపిఎస్)
22. తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసిల్దార్, జూనియర్ ఇంజనీరిoగ్ పదవులకు ముల్కి నిబంధనలు వర్తింపజేస్తూ 1971లో ప్రకటించిన పథకం
Ans: అష్టసుత్ర పథకం
23. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో 1971లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డిని గద్దెదింపి ఎవరిని ముఖ్యమంత్రిగా శ్రీమతిగా ఇందిరాగాంధీ నియమించెను?
Ans: పి. వి. నరసింహారావు
24. తెలంగాణ ఉద్యమ నాయకుడైన మర్రి చేనరెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఏ పార్టీలో విలీనం చేసెను?
Ans: కాంగ్రెస్ పార్టీలో
25. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత కూడా ముల్కి నిబంధనలు అమల్లో ఉంటాయని, అవి చట్టబద్దమైనవేనని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెపిన తేది
Ans: 1972 అక్టోబర్ 3
26. 1972 అక్టోబర్ 3 నాటి సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కావాలంటూ ఆంధ్ర ప్రాంతంలో తల్లెత్తిన ఉద్యమం
Ans: జై ఆంధ్ర ఉద్యమం
27. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని దృస్టిలో పెట్టుకొని ప్రధాని ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న ప్రకటించిన పథకం
Ans: ఆరు సూత్రాల పథకం
28. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో తెలంగాన వారిని నియమించేందుకు 1985 డిసెంబర్ 30న జారి చేసిన జీవో
Ans: 610 జీ.వో.
29. 610 జే.వో. అమలును పరిశీలించడానికి 2001లో ఏర్పాటు చేసిన కమిషన్      
Ans: గిర్ గ్లానీ  ఏకసభ్య కమిషన్
30. తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసందుకు 1985లో విద్యావంతుల సదస్సును ఎక్కడ ఏర్పాటు చేసారు?
Ans: కరీంనగర్
31. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టూ ఎప్పుడు ఏర్పడింది
Ans: 1986
32. 1989లో తెలంగాణ కోసం పలు కర్యక్రమాలు చేపట్టిన సంస్థ
Ans: తెలంగాణ అభివృద్ధి ఫోరం
౩౩.1991 లోఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు జరిపిన సంస్థ\
Ans: తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్
34.తెలంగాణా సమస్యల గురించి ప్రదాని పి. వి. నరసింహరావు ప్రబుత్వానికి 1992లో నివేదికలు సమర్పించిన సంఘం
Ans: తెలంగాణా ఇంజనీర్ల సంగం
35.1996లో తెలంగాణా ప్రజాసమితి వరంగల్లులో నిర్వహించిన సదస్సులో అవిర్బవించిన పార్టీ
Ans: తెలంగాణ ప్రజాపార్టీ
36.ప్రజాకవి కాళోజీ నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణా సదస్సు 1997డిసెంబర్లో ఎక్కడ జరిగింది?
Ans: వరంగల్లులో
37.ప్రొఫెసర్ జయశంకర్ ఆద్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో 1998లో అవిర్బవించిన సంస్థ
Ans: తెలంగాణ ఐక్యవేదిక
38.తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) ఎప్పుడు ఏర్పాటయింది?
Ans: 2001 ఏప్రిల్ 27
39.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
Ans: కె.చంద్రశేఖరరావు (కె.సి ఆర్)
40.టి.ఆర్.ఎస్. అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంబించిన తేదీ
Ans: 2009 నవంబర్ 29
41.కేంద్ర హోం మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంబంమైనట్లు ప్రకటించిన తేదీ
Ans: 2009 డిసెంబర్ 9
 42.2009డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన పై వెనక్కు తగ్గడంతో తెలంగాణ రాష్ట్ర సదన కోసం అన్ని రాజకీయ పార్టీలతో ఎర్పాటు చేయబడిన జాయింట్ యాక్షన్  కమిటీ (జెఎసి) కి చైర్మన్ ఎవరు?
Ans: ప్రొఫెసర్ ఎం. కోదండరాం
43.తెలంగాణ జాయింట్ యాక్షన్  కమిటీ 2010 ఫిబ్రవరి 3న నిర్వహించిన ఆందోళన
Ans: 500  కిలోమీటర్ల మేర మనవ హారం ఏర్పాటు
44.తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థిత పై సంప్రదింపుల కోసo కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న ప్రకటించిన కమిటీ పేరు
Ans: జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ
45.ప్రపంచ చరిత్రలో శాంతియుతంగా జరిగిన అతిపెద్ద ప్రజప్రదర్శనలో ఒకటిగా నిలిచినా (టి.ఆర్.ఎస్) పార్టీ తెలంగాణ మహా గర్జన సభను 2010 డిసెంబర్ 16న ఎక్కడ నిర్వహించింది?
Ans: వరంగల్
46. తెలంగాణలో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయేను?
Ans: 2011 ఫిబ్రవరి 17నుండి
47. .తెలంగాణ జాయింట్ యాక్షన్  కమిటీ నేతృత్వంలో 2011 మార్చి 10  నిర్వహించిన ఆందోళన
Ans: మిలియన్ మార్చ్
48.2011 సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 24 వరకు 42 రూజుల పాటు తెలంగాణ లో  జరగిన చారిత్రాత్మక ఉద్యమం
Ans: సకల జనుల సమ్మే
49.  2011 నవంబర్ 1 నుండి వారం రోజుల పాటు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం నిర్వహించిన, స్వతంత్ర   సమరయోధుడు తెలంగాణ స్వతంత్ర సమరయోధుల ఫోరం చైర్మన్
Ans: కొండా లక్ష్మన్ బాపూజీ
50. తెలంగాణ మార్చ్ నిర్వహించబడిన తేదీ
Ans: 2012 సెప్టెంబర్ 30
51. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మాన్ని ఏకగ్రీవంగా ఆమోడించిన తేదీ
Ans: జూలై 30 2013
52.  29వ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 అక్టోబర్ 3
53. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తలెతే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నాయకత్వం వహించినది
Ans: అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే
54. తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ
Ans: 2013 డిసెంబర్ 3
55. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తేదీ
Ans: 2014 ఫిబ్రవరి 18
56. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ
Ans: 2014 ఫిబ్రవరి 20
57. తెలంగాణ బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తికరణ చట్టం 2014) కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తేది
Ans: 2014 మార్చ్ 1
General Knowledge Bits in Telugu
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 06, 2016

0 comments:

Post a Comment