LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

రవాణా సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రహదారుల

Posted by PAATASHAALANEWS on Tuesday, 4 October 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

రవాణా సౌకర్యాలు

కాచిగూడ రైల్వే స్టేషను
వాయు రవాణా: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరియు విదేశాలకు వెళ్ళడానికి సదుపాయం ఉంది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ విమానాశ్రయంగా పలుసార్లు అవార్డులు పొందినది. విమానాశ్రయ ఏర్పాటుకు ముందు బేగంపేటలో డొమెస్టిక్ విమానాశ్రయం ఉండేది. వరంగల్, నిజామాబాదు, రామగుండంలలో కూడా విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన ఉంది.
రైలు రవాణా: సికింద్రాబాదు మరియు కాజీపేటలు తెలంగాణలోని ప్రముఖ రైల్వేజంక్షన్లు. సికింద్రాబాదు దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రము మరియు దివిజన్ కేంద్రము . హైదరాబాదు/సికింద్రాబాదు నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి. నిజాంల కాలంలో 1874లో వాడి నుండి హైదరాబాదుకు రైలుమార్గం వేయబడింది. సికింద్రాబాదు-విజయవాడ మార్గం 1886లో పూర్తయింది. కాచిగూడ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ఔరంగబాద్ ల మీదుగా మన్మాడ్ వరకు గోదావరి వ్యాలీ రైలు మార్గం 1899లో మొదలు పెట్టి 1901లో ప్రారంభమైంది. సికింద్రాబాదు నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు మీదుగా బెంగుళూరుకు, స్వాతంత్ర్యానంతరం బీబీనగర్ నుంచి నడికుడికి మార్గాలు వేశారు. నూతనంగా గద్వాల నుంచి రాయచూర్ మార్గం 2013అక్టోబరు 12 న[32] ప్రారంభమైంది. దేవరకద్ర నుంచి రాయచూరు, నిజామాబాద్ నుంచి పెద్దపల్లితో సహా పలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి.
తెలంగాణలో గ్రామాలను నగరాలను కలిపే ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు
రోడ్డు రవాణా: దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా ఉత్తర-దక్షిణంగా వెళ్ళుచున్నది. పూనా-విజయవాడలను కలిపే 9వ నెంబరు జాతీయ రహదారి తూర్పు-పడమరలుగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాల మీదుగా పోతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళే జాతీయ రహదారి 16వ (కొత్త నంబరు 63) నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు జిల్లాల మీదుగా వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి భూపాలపట్నం వెళ్ళు జాతీయ రహదారి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వెళ్తుంది.


Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 04, 2016

0 comments:

Post a Comment