ఏ వయసుకు ఎంత నిద్ర?
మనిషికి ఆహారం, నీళ్లు, గాలి ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. నిజానికి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతసేపు నిద్రపోవాలన్న విషయం తెలియక చాలామంది అయోమయానికి గురవుతుంటారు. దీనిపై యూఎస్ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అధ్యయనం చేసి, ఏ వయసు వారు ఎన్నిగంటలు నిద్రపోవాలో పలు సూచనలు చేసింది.
-పిల్లలకు మూడు నెలలు వచ్చేవరకు 14 నుంచి 17 గంటలు నిద్రపోయేలా జాగ్రత్తపడాలి.
-4 నుంచి 11 నెలలు వచ్చే వరకు పిల్లలు 12 నుంచి 15 నిద్రపోవడం మంచిది.
-1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు 11 నుంచి 14 గంటల సేపు నిద్రపోవడం ఆరోగ్యకరం.
-3 నుంచి 5 ఏళ్ల పిల్లలు 10 నుంచి 13 గంటలు నిద్ర తప్పనిసరి.
-6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు నిద్రపోవడం ఆర్యోగానికి మంచిది.
-14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్ రోజుకి 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవాలి.
-18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో ఉండేవాళ్లు 7 నుంచి 9గంటల నిద్ర సరిపోతుంది.
-26 నుంచి 64 ఏళ్ల వయసు వాళ్లు 7 నుంచి 9గంటలు నిద్రపోవాలి. 65 ఏళ్లు పైబడిన వాళ్లు 7 నుంచి 8గంటలు నిద్రపోతే సరిపోతుందంటోంది అధ్యయనం చేసిన ఫౌండేషన్.
0 comments:
Post a Comment