[6:08AM, 01/10/2016] LakshyaSriuradi✍: *:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 1*
*ప్రపంచ వృద్ధుల దినోత్సవం*,
*చైనా జాతీయదినోత్సవం,*
*నైజీరియా జాతీయదినోత్సవం.*
*ప్రపంచ శాఖాహార దినోత్సవం (World Vegetarian Day)*
*:జాతీయ రక్తదాన దినోత్సవం.*
*సంఘటనలు*
1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.
*1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు*.
1793 : ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే
కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.
1984 : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ.
బజరంగ్ దళ్ స్థాపన.
1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
*జననాలు*
1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)
1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)
1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)
1915: కళాధర్ , చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి , ప్రముఖ హాస్య నటుడు. (మ.1974)
1922: అల్లు రామలింగయ్య , ప్రముఖ హాస్య నటుడు. (మ.2004)
1934: భువన్ చంద్ర ఖండూరి , భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.
1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
1939: ఎల్కోటి ఎల్లారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)
1942: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (మ.2016)
1951: జి.ఎం.సి.బాలయోగి , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్సభ స్పీకర్. (మ.2002)
1961: నిమ్మగడ్డ ప్రసాద్ , ఫార్మా మాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్ ప్రసాద్ అంటారు
1901: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
⚫ *మరణాలు*
1939: వెన్నెలకంటి సుబ్బారావు , ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)
1946: గూడవల్లి రామబ్రహ్మం, ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (జ.1902)
1975: ఆదుర్తి సుబ్బారావు , తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)
1979: పి.వి.రాజమన్నార్ , న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)
*శరన్నవరాత్రులు ప్రారంభం
[7:17AM, 02/10/2016] LakshyaSriuradi✍: *:చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 2*
*గాంధీ జయంతి*
*లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.*
1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
*జననాలు*
1852: విలియం రామ్సే , స్కాట్లాండుకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
1911: జోస్యం జనార్దనశాస్త్రి , అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (మ.1997)
.
⚫ *మరణాలు*
1961: శ్రీరంగం నారాయణబాబు , ప్రముఖ తెలుగు కవి. (జ.1906)
1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
1982: సి.డి.దేశ్ముఖ్ , భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త. (జ.1896)
[ LakshyaSriuradi✍: *చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 3*
*సంఘటనలు*
1860: బ్రిటిష్ ప్రభుత్వం , 17 ఆగష్టు 1860 నాడు
పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను
3 అక్టోబర్ 1860 , నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
1990: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి. బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మనీ విలీనం జరిగినది.
1957 : ఆకాశవాణి (All India Radio) యొక్క విశిష్ట సేవ వివిధ భారతి ప్రారంభం.
1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని
జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
2005: వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
*జననాలు*
1903: స్వామి రామానంద తీర్థ , స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972)
1924: ఎం.ఎస్.ఆచార్య , ప్రముఖ పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
1926: నారాయణరావు పవార్ , తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010)
1988: కాశి రాజు , వర్థమాన కవులలో ఒకడు,
కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు.
1964 : ఆంగ్ల నటుడు క్లైవ్ ఓవెన్ జననం.
⚫ *మరణాలు*
1992: దిగవల్లి వేంకటశివరావు , స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898)
2006: ఇ.వి.సరోజ , 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. (జ.1935)
1923 : బ్రిటిషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు, స్త్రీవిమోచన కార్యకర్త కాదంబినీ గంగూలీ మరణం (జ.1861).
*చరిత్రలో ఈ రోజు/అక్టోబర్04*
*ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం*
*సంఘటనలు*
1934 : అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.
*జననాలు*
1911 : కమలాకర కామేశ్వరరావు , ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. (జ.1998)
1912 : కుంకలగుంట సైదులు , మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.
1920 : తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి , ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (మ.2013)
1957 : గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
1977 : సంఘవి, కన్నడ మరియు తెలుగు సినిమా నటి.
*మరణాలు*
1904 : ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి , అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో
బెల్ఫోర్ట్లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .
1947 : మాక్స్ ప్లాంక్ , ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)
2015 : ఏడిద నాగేశ్వరరావు , ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)
:" లక్ష్యశ్రీ " ఉరడీ వెంకటెశ్. LakshyaSriuradi✍: *చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 5*
*అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.*
*సంఘటనలు*
1864: కలకత్తాలో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
1964: రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది
.
1989 : దలైలామా కు నోబెల్ శాంతిబహుమతి వచ్చింది
2006: కేంద్ర ప్రభుత్వము తన ఉద్యోగుల జీత భత్యాలను సవరించటానికి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఛైర్మన్ గా ఆరవ వేతన సంఘాన్ని నియమించింది. 18 నెలలలో నివేదిక సమర్పించాలని చెప్పింది. ప్రొఫెసర్ రవీంద్ర ధోలకియా, జె.ఎస్. మాథుర్ లు సభ్యులుగా, శ్రీమతి సుష్మా నాథ్, మెంబర్-సెక్రటరీగా ఉన్నారు.
*జననాలు*
1882: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945)
1885: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు , సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1964)
1914: పేరేప మృత్యుంజయుడు , భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
1929: గుడిసెల వెంకటస్వామి (జి.వెంకటస్వామి) , భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (మ.2014)
1929: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (మ.2009)
1930: మధురాంతకం రాజారాం , ప్రముఖ రచయిత. (జ.1999)
1952 : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర విభాగము యొక్క అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మరియు రచయిత కంచ ఐలయ్య జననం.
1954: ఎం.వి.రఘు , ప్రముఖ ఛాయాగ్రాహకుడు,
కళ్లు సినిమా దర్శకుడు.
1965: కల్పనా రంజని ప్రముఖ మలయాళ సినిమా నటి (మ.2016)
1946 : ప్రముఖ సినిమా నటి రమాప్రభ జననం
⚫ *మరణాలు*
2001: కల్లూరి తులశమ్మ , ప్రముఖ సంఘసేవకురాలు మరియు ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910)
2011 : యాపిల్ ఇన్కార్పొరేటేడ్ కు చైర్మెన్ మరియు CEO
స్టీవ్ జాబ్స్ మరణం (జ.1955).
LakshyaSriuradi✍: *వికాల౦గ ఉద్యోగుల స౦ఘ౦TSఉపాధ్యాయవిభాగ౦*
*చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 6*
*సంఘటనలు*
1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1927: 'ది జాజ్ సింగర్' అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు.ఒకటి, రెండుపాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.
1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంబించబడింది.
✳ *జననాలు*
1893 : భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం (మ.1956)
1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)
1908: ఈశ్వరప్రభు , చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు , ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
1958: పనబాక లక్ష్మి, భారత పార్లమెంటు సభ్యురాలు.
⚫ *మరణాలు* ☸
1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్ , ఆంగ్ల కవి. (మ.1892)
1967: సి.పుల్లయ్య , మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898)
2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (జ.1927)
:" LakshyaSriuradi✍: *చరిత్రలో ఈ రోజు/అక్టోబర్07*
*సంఘటనలు*
1737 : 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.
*జననాలు*
1885 : నీల్స్ బోర్ , ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)
1900 : గంటి జోగి సోమయాజి , ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
1900 : హైన్రిచ్ హిమ్లెర్ , ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (మ.1945)
1901 : మసూమా బేగం , సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
1929 : కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు మరియు ఉత్తమ అధ్యాపకుడు.
1945 : అట్లూరి సత్యనాథం , కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
*మరణాలు*
1940 : కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
1976 : పి. చంద్రారెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
2007 : పి.యశోదారెడ్డి , ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)
0 comments:
Post a Comment