LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

CTET Online Applications

Posted by PAATASHAALANEWS on Thursday, 23 June 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
సిటెట్‌-2016కు సన్నద్ధం ఇలా.... కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటెన్‌, కేంద్రపాలిత, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్లుగా కెరీర్‌ ప్రారంభించాలనుకునే వారు సెంట్రల్‌ టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌)ను రాయాల్సి ఉంటుంది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించే ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు పైన పేర్కొన్న పాఠశాలల్లో ఉద్యోగాలకు అర్హులు. ఈ సంస్థల్లో చేరాలనుకునేవారి కోసం సీటెట్‌-2016ను ఈనెల 21న నిర్వహిస్తున్నారు. సీటెట్‌లో రెండుపేపర్లు ఉంటాయి. ప్రాధమిక పాఠశాలల్లో(ఒకటి నుంచి ఐదో తరగతి వరకు) టీచర్లుగా చేరాలనుకునేవారు పేపర్‌ - 1లో అర్హత సాధించాలి. ఉన్నత పాఠశాలల్లో (ఆరు నుంచి ఎనిమిదో తరగతి) చేరాలనుకునేవారు పేపర్‌-2 రాయాలి. రెండు స్థాయిల్లోనూ ఉపాధ్యాయఅర్హత కోసం రెండు పేపర్లలోనూ ఉత్తీర్ణులై అర్హత సాధించాలి. పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్‌ ఇస్తారు. సీటెట్‌ స్కోరు ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతుంది.మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలోసీటెట్‌ను మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నల సంఖ్య 150. మార్కులు కూడా 150. సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/హిందీభాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.పేపర్‌ -1ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌ -1, లాంగ్వేజ్‌ -2, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టులో 30 వంతున మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మార్కులు కూడా150 ఉంటాయి.పేపర్‌ -2 పేపర్‌ -2లో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ, లాంగ్వేజ్‌-1, లాంగ్వేజ్‌-2, మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ లేదా సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి. మొదటి మూడు సబ్జెక్టుల్లో 30 ప్రశ్నలు వంతున, మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ లేదా సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులో 60 ప్రశ్నలు వంతున ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి.పేపర్‌ -1 అర్హత : కనీసం 50 శాతం మార్కులతో సీనియర్‌ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటికితోడు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు / అందుకు సమానమైనది.పేపర్‌ - 2 అర్హత : గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి కలిగిన డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) ఉత్తీర్ణత లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. లేదా కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఏడాది వ్యవధి కలిగిన బ్యాచిలర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ/ అందుకు సమానమైనది.సన్నద్ధానికి సూచనలుచైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీలో విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా టీచింగ్‌, లెర్నింగ్‌, ఎడ్యుకేషనల్‌ సైకాలజీలో ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల సైకాలజీలోని కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితరఅంశాలను క్షుణ్ణంగా చదవాలి. లాంగ్వేజ్‌ విధానంలో సంబంధిత మాధ్యమంలో అభ్యర్థి ప్రొఫీషియన్సీతోపాటు కమ్యూనికేషన్‌,కాంప్రహెన్షన్‌ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఇందుకోసం బేసిక్‌ గ్రామర్‌ మీద పట్టు పెంచుకోవాలి. కాంప్రహెన్షన్‌, ఫానెటిక్స్‌, లెటర్‌ రైటింగ్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌లో ఎక్కువగాకాన్సెప్ట్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో రాణించేందుకు పేపర్‌-1కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ/సీబీఎస్‌ఈ పుస్తకాల్లోని సిలబస్‌కు అనుగుణంగా సన్నద్ధం కావాలి. పేపర్‌-2కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదో తరగతి సిలబస్‌ను క్షుణ్ణంగాఅధ్యయనం చేయాలి. ప్రశ్నల కఠినత్వం స్థాయి పేపర్‌-1కు పదో తరగతి స్థాయిలో, పేపర్‌-2కు సీనియర్‌ సెకండరీ స్థాయి వరకు ఉంటుంది. గత ప్రశ్నాపత్రాల ఆధారంగా సిలబస్‌పై అవగాహన పెంచుకుని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
Ctet నోటిఫికేషన్ రిలీస్ అయింది.
full details కి www.ctet.nic.in
చూడచ్చు
CTET Online Applications are Started on 22.06.2016 for Phase of September Exam
Submission Applications :
22.06.2016 to 18.07.2016
Halltickets Available from 17.08.2016
Exam Date : 18.09.2016
Paper 1 : 9:30am to 12:00pm
Paper 2 : 2:00pm to 4:30pm..
More Details go to This URL :
Www.Ctet.nic.in
CTET Online Applications
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 23, 2016

0 comments:

Post a Comment