LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

విద్యాహాక్కు చట్టo ముఖ్యాంశాలు

Posted by PAATASHAALANEWS on Thursday, 31 March 2016


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register


విద్యాహాక్కు చట్టo ముఖ్యాంశాలు-సెక్షన్లు వివరణ

ఈచట్టంలో 07 అద్యాయoలో;38 సెక్షన్లు;01 షెడ్యూల్ ఉన్నాయి.

విద్యాహక్కు చట్టం-2009 లోని ఆంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 29,30నియమాలకు లోబడి ఉంటాయి.

2009 జూలై 20న భారత పార్లమెంట్ విద్యహక్కు చట్టాన్ని ఆమోదించింది.

ఆగస్ట్ 26న భారత రాష్ట్రపతి ఆమోదాన్ని పొందినది.

01 ఏప్రిల్ 2010 నుండి అమలులోకి వచిన్ది.

ఈ చట్టం జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశానికి అంతటికీ వర్తిస్తుంది.

�ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్న దేశం చీలి.

ప్రపంచంవ్యాప్తంగా 135 దేశాల్లో ఈ చట్టం అమలవుతుతోంది.

భారతదేశంలో మెదటిసారిగా ఉత్తరప్రదేశ్ లో విద్యాహక్కుచట్టం అమలయ్యిoది.

విద్యాహక్కు చట్టం- 7 అధ్యాయాలు
చట్టం పేరు,పరిధి,అమలు,వివిధ పదాలకు సంబందించిన అర్ధాలు,నిర్వచనాలు పొందుపర్చారు.ఈ వివరాలను 1 నుండి 3 సెక్షన్ల ద్వారా తెలిపారు.
అధ్యాయం-2

ఉచిత విద్యకు బాలల హక్కు,బడిలో ప్రవేశం,బదిలీ ధ్రువీకరణ పత్రం మొ!! అంశాలను పొందుపర్చారు. వివరాలను 4,5 సెక్షన్ ల ద్వారా తెలిపారు.

ధ్యాయం-3

కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వం,స్థానిక ప్రభుత్వం,తల్లిదండ్రుల బాధ్యత,పూర్వ ప్రాధమిక విద్యాకేంద్రాల ఏర్పాటు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను 6-11 సెక్షన్ ల ద్వారా తెలిపారు.
ఆధ్యాయo-4

బడులు ఉపాధ్యాయుల బాధ్యతలకు సంబందించిన వివరాలు పొందుపర్చారు.వివరాలను 12 నుండి 28 సెక్షన్ల ద్వారా తెలిపారు.

అధ్యాయం-5
నాణ్యమైన విద్యకు సంబందించిన విద్యా ప్రణాళికలు,పాఠ్యప్రణాళికలు,ముల్యాoకానా విధానాలు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను 29,30 సెక్షన్ల ద్వారా తెలిపారు.
అధ్యాయం-6
బాలల హక్కుల సంరక్షణ,పర్యవేక్షణ,
పిర్యాదుల పరిష్కారం,
జాతీయ,రాష్ట్ర స్తాయిలో సలహా సంఘాల ఏర్పాటు మొ!! అంశాలను పొందుపర్చారు.వివరాలను సెక్షన్ 31-34 ద్వారా తెలిపారు.
అధ్యాయం-7
చట్టం గురించి ఆదేశాలు,జారీచేసే అధికారాలు,ప్రాసిక్యూషన్,
చేపట్టాల్సిన చర్యలు,నియమ నిబంధనలు రూపొందించడం గురించిన అంశాలను పొందుపర్చారు.వివరాలు 35.38 సెక్షన్ల ద్వారా వివరించారు.
***విద్యాహక్కు చట్టంలోని 38 సెక్షన్లు-ప్రాధాన్యత**
1⃣ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలలహక్కు చట్టం-2009 గా పిలుస్తారు.
2⃣చట్టంలోని వివిధ భావనలు-నిర్వచనాలు.

3⃣6-14 సం!! ఉన్న బాల బాలికలందరికి పరిసర ప్రాంత పాఠశాలల యందు ప్రాధమిక విద్యను పూర్తి చేసేవరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు.

4⃣6-14 సం!! నిండిన బాల బాలికలను పాఠశాలలో చేర్చకపోయినా లేదా చేర్చిన తరువాత ప్రాధమిక విద్యను పూర్తిచేయకపోయినా వారి వారి వయస్సుకు
తగ్గ తరగతిలో చేర్చుకోవాలి.వయస్సుకు తగిన తరగతిలో ప్రవేశం పొందిన బాలలు తోటి వారితో సమాన సామర్ధ్యాలు పొందడానికి,సిఫారసు చేసిన పద్దతిలో,సిఫారసు చేసిన
కాలవ్యవధిలో ప్రత్యేక శిక్షణ పొందే హక్కును కలిగియుంటారు.
5⃣విద్యార్ధి వేరే బడిలో ప్రవేశం పొందడానికి బదిలీ కోరే హక్కును కలిగియుంటాడు.అయితే బదిలీ ధ్రువీకరణ పత్రం ఆలస్యం అయిందని వేరే బడిలో ప్రవేశం ఇవ్వకపోవడానికి,ఆలస్యంగా చేర్చుకోవడానికి కారణంగా చూపడానికి వీలులేదు.
**
6⃣ఈ చట్టం అమలు తేదీనుండి 3సo!!లోపు పాఠశాలల్లో తరగతి గదులను ఏర్పాటుచేయాలి.
7⃣ఈ చట్టం అమలుకు నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి(65:35)
8⃣రాష్ట్రప్రభుత్వ బాధ్యతలు
*6-14 సం!! వయస్సున్న బాలబాలికలందరికీ ఉచితంగా ప్రాధమిక విద్యను అందించడం.
*పరిసర ప్రాంతాల్లో 'బడి' అందుబాటులో ఉండే విధంగా చూడడం.
9⃣స్ధానిక ప్రభుత్వ బాధ్యతలు

**14సం!! బాలబాలికలందరి రికార్డులు నిర్వహించడం.

పాఠశాల భవనం,బోదనా సిబ్బంది,బోదనా పరికరాలతో సహా మౌళిక సదుపాయాలు కల్పించడం.

విద్యాక్యాలెండర్ నిర్ణయించడం మొ!!
1⃣0⃣6-14 సం!! పిల్లలను పరిసర ప్రాంతాల్లోని ప్రాధమిక పాఠశాలల్లో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత.
1⃣1⃣3సం!!:మించిన బాలలను ప్రాధమిక విద్యకు సంసిద్దులను చేయడానికి 6 సం!! నిండేవరకు బాలలందరికీ శైశవదశ సంరక్షణ,ఉచిత పూర్వ పాఠశాల విద్యనందించడానికి అవసరమైన ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వమే చేయాలి.
1⃣2⃣బడుల పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలకు,ప్రతికూల పరిస్తితులు ఎదుర్కొంటున్న బ్రున్దాలకు చెందిన బాలలకు 1వ తరగతిలోని విధ్యార్దుల సంఖ్యలో 25%ప్రైవేటుకు కేటాయించి ప్రాధమిక విద్యను పూర్తి చేసేంతవరకు ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలీ.
1⃣3⃣బడిలో ప్రవేశానికి ఏంపిక విధానం,క్యపిటేషన్ రుసుము ఉండకూడదు.
1⃣4⃣వయస్సు నిర్దారణ లేని కారణంగా ప్రవేశాన్ని తిరస్కరించకూడదు.
******
1⃣5⃣విద్యాసంస్థలలో ఎప్పుడైనా ప్రవేశాన్ని కల్పించాలి.
1⃣6⃣బడిలో ప్రవేశం పొందిన బాలబాలికలను ప్రాధమిక విద్య పూర్తయ్యేవరకు ఏ తరగతిలో నైనా మళ్ళీ కొనసాగించకూడదు,బడి నుండి తీసివేయరాదు.
1⃣7⃣ఏ బాలుడు/బాలికను  కూడా శారీరక,మానసిక వేధింపులకు గురిచేయకూడదు.
1⃣8⃣ & 1⃣9⃣ గుర్తింపు పత్రం లేకుండా ఏ బడిని ప్రారంబించకూడదు.
2⃣0⃣షెడ్యూల్ని సవరించే అధికారం సంబంధిత ప్రభుత్వానికి ఉంటుంది.
2⃣1⃣బడి యాజమాన్య సంఘం(SMC) ఏర్పాటు,విధులు
2⃣2⃣బడి అభివృద్ధి ప్రణాళిక
2⃣3⃣కేంద్రప్రభుత్వ ప్రకటన ద్వారా  అధీక్రుతo చేసిన అకాడమిక్ సంస్థ నిర్దారించిన కనీస అర్హతలున్న ఏ వ్యకినాయినా టీచర్గా నియమించవచు.

2⃣4⃣టీచర్ల విధులు-సమస్యల పరిష్కారం
2⃣5⃣చట్టం అమలులోకి వచిన 6 నెలలలోపు షెడ్యూల్ నిర్దారించిన విద్యార్ధుల-టీచర్ల నిష్పత్తి ప్రతి బడిలోనూ ఉండేలా ప్రభుత్వం (లేదా) స్థానిక ప్రభుత్వం చూడాలి.
***
2⃣6⃣టీచర్ ఖాళీలను భర్తీ చేయుట,ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% నికి మించరాదు.
2⃣7⃣10 సం!! ఒకసారి జరిగే జనాభా గణన,ప్రక్రుతీ వైపరీత్యాలలో సహాయ విధులు,పార్లమెంట్,రాష్ట్ర శాసనసభ,స్థానిక ఎన్నికలకు  సంబందించిన విధులను మినహాయించి టీచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదు.
2⃣8⃣ఏ టీచరు కూడా ప్రైవేట్
టూషన్లు,ప్రైవేట్ బోధనా పనులు చేపట్టరాదు.
2⃣9⃣పాఠ్యప్రణాళిక-ముల్యాoకన విధానం.

3⃣0⃣ప్రాథమిక విద్య పూర్తయిన వెంటనే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
3⃣1⃣విద్యకు బాలల హక్కుల పరిరక్షణ
3⃣2⃣పిర్యాదుల పరిష్కారం
3⃣3⃣జాతీయ సలహా సంఘం
3⃣4⃣రాష్ట్ర సలహా సంఘం
3⃣5⃣ఆదేశాలు జారీచేసే అధికారాలు
3⃣6⃣నేరనిరూపణకు ముందస్తు అనుమతి
3⃣8⃣ఈ చట్టం అమలు చేయడానికి,నియమ నిబంధనలు  రూపొందించడానికి, సంబంధిత ప్రభుత్వాలకే అధికారం

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 31, 2016

0 comments:

Post a Comment