LATEST UPDATES

AP LATEST UPDATES

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Bed 2015

Posted by PAATASHAALANEWS on Sunday, 27 September 2015


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

బీఈడీ కోర్సులో.. ఇక సెమిస్టర్లు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నైపుణ్యాలు పెంచేందుకు బీఈడీలో ఈ విద్యాసంవత్సరం నుంచి సీబీసీఎస్ కోర్సును అమలు చేసేందుకు అన్ని విశ్వవిద్యాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించింది.. ఉన్నత విద్య అయిన బీఈడీ చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే విధంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ), రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చింది.. దీనిలో భాగంగా బీఈడీ రెండేళ్ల కోర్సులో సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్)ను ప్రవేశపెట్టింది..

గతంలో బీఈడీలో వార్షిక పరీక్షలు ఉండేవి. కానీ ఈ సీబీసీఎస్ నూతన విధానంతో ఐదు నెలలకో పర్యాయం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ఈ విధంగా రెండేళ్లకు నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. అలాగే ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ పరీక్షలు ఉంటాయి. ఈ విధానంలో మార్కులు కాకుండా గ్రేడింగ్స్‌ను ఇస్తారు.
మౌలిక వసతులు, సిబ్బంది ఉండాల్సిందే..
సెమిస్టర్స్ విధానంలో పరీక్షలు నిర్వహణకు ఎన్‌సీటీఈ, రాష్ట్ర విద్యా మండలి భావిస్తుండటం తో ఇక బీఈడీ కళాశాలల్లో మౌలిక వసతులు త ప్పనిసరి ఉండాల్సిందే. అంతే కాకుండా పూర్తి స్థా యి బోధన, బోధనేతర సిబ్బంది కూడా ఉండాలి. ఈ విధానంతో విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెంచనున్నారు.

ఫలితాలు ఎక్కువగా వస్తాయి..
బీఈడీ రెండేళ్ల కోర్సుకు సెమిస్టర్ విధానం పీజీ, డిగ్రీ, కోర్సుల తరహాలో అమల్లోకి వస్తుండటం శుభ పరిణామం. విద్యార్థులు ప్రస్తుతం సంవత్సరం చదివి వార్షిక పరీక్షలకు హాజరవుతారు. కానీ ఈ సీబీసీఎస్ ద్వారా తక్కువ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇష్టంతో చదువుతారు. ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది.

గ్రేడింగ్ ఇలా..
పదో తరగతి స్థాయిలో అమలు జరుగుతున్న కంటిన్యూస్ కాంప్రెసిన్స్ ఎవల్యూషన్(సీసీఈ) విధానంలో పరీక్షల్లో గ్రేడింగ్స్‌ను ఇస్తున్నారు. దీని తరహాల్లో ఇక బీఈడీలో పరీక్షల ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు కానుంది.
* పది గ్రేడ్ పాయింట్లు వస్తే అవుట్ స్టాండింగ్‌తో గ్రేడ్-ఓ
* తొమ్మిది వస్తే ఎక్స్‌లెంట్‌గా గ్రేడ్-ఏ+
* ఎనిమిది వస్తే వెరీ గుడ్‌గా గ్రేడ్-ఏ
* ఏడు వస్తే గ్రేడ్-బీ+
* ఆరు వస్తే గ్రేడ్-బి
* ఐదు వస్తే గ్రేడ్-సీ
* నాలుగు వస్తే గ్రేడ్-పి (ఉత్తీర్ణులైనట్లు నిర్ధారణ)
* సున్న గ్రేడ్ వస్తే ఫెయిలైనట్లు.
* ఏబీ అని వస్తే పరీక్షలకు గైర్హాజరు అ యినట్లుగా పరీక్షల అనంతరం మెమోల జారీలో ప్రచురించనున్నారు.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 27, 2015

0 comments:

Post a Comment